Vitamin Supplements | విటమిన్ మాత్రలు: ఆరోగ్యానికి మంచిదా, ప్రమాదమా?

Vitamin Supplements

జుట్టు తెల్లబడుతోందని విటమిన్-బి మాత్రలు, చర్మంపై మచ్చలు వస్తున్నాయని విటమిన్-ఇ క్యాప్సూల్స్, రోగనిరోధక శక్తికి విటమిన్-సి, కంటిచూపుకు విటమిన్-ఎ... ఇలా ప్రతి ఒక్కరూ వైద్యుడిలా మారి విటమిన్ మాత్రలు తీసుకుంటున్నారు. కానీ వైద్యుల సలహా లేకుండా, గడువు తేదీని పట్టించుకోకుండా ఇష్టానుసారంగా విటమిన్ మాత్రలు వేసుకోవడం వల్ల తీవ్రమైన, శాశ్వత దుష్ప్రభావాలు ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా, అధిక మోతాదులో విటమిన్లు తీసుకోవడం వల్ల కాలేయం (లివర్), మూత్రపిండాలు (కిడ్నీలు) వంటి ముఖ్యమైన అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఉదాహరణకు, విటమిన్ బి6, బి12 మాత్రలు అధిక మోతాదులో తీసుకుంటే నాడీ వ్యవస్థపై తీవ్రమైన ప్రభావాలు చూపే అవకాశం ఉంది.  విటమిన్-సి మాత్రలతో జీర్ణవ్యవస్థ దెబ్బతినడమే కాకుండా, కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. 

నిరంతరాయంగా విటమిన్-ఎ తీసుకుంటూ ఉంటే, మనిషి కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. విటమిన్-కె మాత్రలు కొన్ని మందులు వాడుతున్నవారికి తీవ్ర దుష్ప్రభావాలు కలిగించే ప్రమాదం ఉంది. . రక్తం గడ్డకట్టే సమస్య ఉన్నవారికి ఇది ప్రాణాంతకంగా కూడా మారవచ్చు.

కాబట్టి, విటమిన్ మాత్రలు వాడే ముందు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించి, వారి సలహా మేరకు మాత్రమే తీసుకోవడం చాలా ముఖ్యం. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు