Oversleeping: Harmful to Health? | అతి నిద్ర: ఆరోగ్యానికి హానికరమా?

 

Oversleeping

వైద్యులు సాధారణంగా రోజుకు 6 నుంచి 8 గంటల నిద్ర ఆరోగ్యానికి అవసరమని సిఫార్సు చేస్తుంటారు. కానీ, చాలా మంది నిర్దేశించిన సమయం కంటే ఎక్కువ గంటలు నిద్రిస్తుంటారు, అంటే 8 గంటలకు మించి. నిద్ర శరీరానికి అవసరమే అయినప్పటికీ, అది శ్రుతి మించితే లాభాలకు బదులు నష్టాలే ఎక్కువగా ఉంటాయి. మరి అతి నిద్ర వల్ల కలిగే దుష్పరిణామాలను ఇప్పుడు తెలుసుకుందాం.

బరువు పెరుగుదల

అతి నిద్ర అధిక బరువుకు దారితీస్తుంది. శరీరం అనవసరంగా కొవ్వును నిల్వ చేసుకుంటుంది, ఇది స్థూలకాయానికి దారి తీస్తుంది.

శారీరక సమస్యలు

ఎక్కువ నిద్ర తలనొప్పి, వెన్ను నొప్పి వంటి సమస్యలను తెచ్చిపెడుతుంది. అంతేకాదు, గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.

మానసిక, గుండె సంబంధిత సమస్యలు

అతి నిద్ర డిప్రెషన్, ఇతర మానసిక సమస్యలకు దారితీస్తుంది. కొందరిలో గుండె అసాధారణ రీతిలో కొట్టుకోవడం వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు.

నిత్యం అలసట

ఎక్కువ నిద్ర పోవడం వల్ల , విపరీతమైన అలసట ఉంటుంది. ఏ పని చేయాలనిపించదు, చిన్న పని చేసినా వెంటనే అలసిపోతుంటారు.

వృద్ధాప్య లక్షణాలు, సంతాన సమస్యలు

అతి నిద్ర వల్ల వృద్ధాప్య లక్షణాలు త్వరగా కనిపిస్తాయి. స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ సంతాన సాఫల్యత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

ఆయుష్షు తగ్గే ప్రమాదం

నిత్యం అతిగా నిద్రించే వారు త్వరగా చనిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని శాస్త్రవేత్తలు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

మీరు కూడా ఎక్కువ నిద్రపోయే వారిలో ఒకరా? ఈ విషయాలు విన్నాక మీ నిద్ర అలవాట్లను మార్చుకోవాలని అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియజేయండి!


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు