మునుగోడులో రాజగోపాల్ రెడ్డి "నయా రూల్స్" !

surya
By -
0

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీరే వేరు. ఇప్పటికే పనుల విషయంలో అధికారులకు తనదైన స్టైల్‌లో వార్నింగ్ ఇచ్చిన ఆయన, ఇప్పుడు లిక్కర్ వ్యాపారులకు కొత్త షరతులు విధించడం నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది

మునుగోడు నియోజకవర్గంలో నూతన వైన్ షాపులను దక్కించుకున్న వ్యాపారులకు ఆయన "నయా రూల్స్" పెట్టారట. నా మాటే శాసనమంటూ.. మద్యం వ్యాపారులకు ఆయన ఫత్వా జారీ చేశారన్న చర్చ జోరుగా సాగుతోంది.


మునుగోడులో రాజగోపాల్ రెడ్డి "నయా రూల్స్"


"ప్రభుత్వ పాలసీ చెల్లదు.. నాదే పాలసీ!"

"మునుగోడు నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు చెల్లవు.. నా సొంత పాలసీలే ఇక్కడ అమలవుతాయ"ని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాపారులతో అన్నట్లు సమాచారం.

రాష్ట్రవ్యాప్త మద్యం పాలసీ మునుగోడులో చెల్లదంటూ లిక్కర్ వ్యాపారులకు ఆయన షరతులు విధించారట. నియోజకవర్గంలో మద్యం షాపులను దక్కించుకున్న వ్యాపారులు ఇటీవల రాజగోపాల్ రెడ్డిని కలవగా, ఆయన వారికి మూడు కండిషన్లు పెట్టినట్లు తెలుస్తోంది.


ఎమ్మెల్యే పెట్టిన 3 కండిషన్లు ఇవే!

మొదటి కండిషన్ ప్రకారం.. వైన్స్ షాపులు ఉదయం 10 గంటలకు తెరవడానికి వీల్లేదు. మధ్యాహ్నం 1 గంటకు మాత్రమే షాపులు తెరవాలి, రాత్రి 10 గంటలకు కచ్చితంగా క్లోజ్ చేయాలి.

రెండవది, పర్మిట్ రూమ్‌లు పగటిపూట పూర్తిగా మూసేయాల్సిందే. కేవలం సాయంత్రం 5 గంటలకు ఓపెన్ చేసి, వైన్స్ షాపుతో పాటే మూసేయాలి.


బెల్టు షాపులకు లిక్కర్ అమ్మితే.. కఠిన చర్యలు!

ఇక మూడవ, అత్యంత ముఖ్యమైన కండిషన్.. బెల్టు షాపులకు లిక్కర్ అమ్మేందుకు వీల్లేదు. తన ఆదేశాల మేరకే మునుగోడులో లిక్కర్ షాపులు నడవాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారట.


159 గ్రామాల్లో స్పెషల్ టీమ్స్

తాను గీసిన లైన్ దాటితే ఒప్పుకునే ప్రసక్తే లేదని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారట. నియోజకవర్గంలోని 159 గ్రామాల్లో ప్రత్యేకంగా టీమ్లను ఏర్పాటు చేస్తానని, ఈ బృందాలు బెల్టుషాపులపై నిఘా పెడతాయని లిక్కర్ వ్యాపారులకు చెప్పినట్లు తెలిసింది.


మునుగోడును 'రోల్ మోడల్'గా మార్చడమే లక్ష్యం

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మద్యం అమ్మకాలపై గత కొంతకాలంగా ఓ ఉద్యమంలా చేస్తున్నారు. నియోజకవర్గంలో విచ్చలవిడిగా ఉన్న బెల్ట్ షాపుల నిర్మూలనకు ఆయన గత 20 నెలలుగా తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఆయన చర్యలు సత్ఫలితాలు కూడా ఇచ్చాయి.


తెలుగు రాష్ట్రాల్లో మునుగోడును రోల్ మోడల్‌గా నిలబెట్టాలన్నదే తన లక్ష్యమని ఎమ్మెల్యే చెబుతున్నారు. రెండేళ్లలో మరిన్ని కఠిన చర్యలు అమలు చేయడం ద్వారా, వెనకబడ్డ మునుగోడులో మద్యపానాన్ని అదుపు చేయాలని ఆయన భావిస్తున్నారట.


ఇందుకు అందరూ సహకరించాలని, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన లిక్కర్ వ్యాపారులకు తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. మొత్తానికి, మద్యం వ్యాపారులకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జారీ చేసిన ఈ 'మద్యం ఫత్వా'పై సర్వత్రా చర్చ జరుగుతోంది.


Tags:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!