రామ్ పోతినేని ఆ హీరోయిన్‌తో డేటింగ్‌లో ఉన్నాడా? స్వయంగా రామ్ రాసిన ఆ 'లవ్ సాంగ్' వెనుక అసలు సీక్రెట్ ఏంటో ఆయనే బయటపెట్టాడు!
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, అందాల భామ భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన 'ఆంధ్రా కింగ్ తాలూకా' చిత్రం నవంబర్ 27న సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే, ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందంటూ సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. వీరు ప్రైవేట్‌గా కలుస్తున్నారని, విదేశీ టూర్లకు వెళ్తున్నారని రకరకాల ప్రచారాలు జరిగాయి.
రూమర్లపై రామ్ రియాక్షన్ ఇదే..
సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్లలో బిజీగా ఉన్న రామ్, తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. డేటింగ్ వార్తలన్నీ పచ్చి అబద్ధాలని కొట్టిపారేశాడు. భాగ్యశ్రీ తనకు కేవలం ఒక మంచి స్నేహితురాలు మాత్రమేనని స్పష్టం చేశాడు.
ఆ పాట ఆమె కోసం రాసింది కాదు!
ఈ సినిమా కోసం రామ్ స్వయంగా ఓ లవ్ సాంగ్ రాయడం ఈ పుకార్లకు ఆజ్యం పోసింది. ఆమెపై ఇంట్రెస్ట్ లేకపోతే రామ్ అంత మంచి పాట రాయలేడని అందరూ అనుకున్నారు. దీనికి రామ్ అసలు లాజిక్ చెప్పాడు:
నేను ఆ పాట రాసే సమయానికి భాగ్యశ్రీని ఇంకా ఈ సినిమా కోసం ఎంపిక చేయలేదు.
సినిమాలోని హీరో, హీరోయిన్ పాత్రల మధ్య ఉన్న బలమైన బాండింగ్ వల్లే ఆ పాట అంత బాగా వచ్చింది.
మా మధ్య స్నేహానికి మించి ఏమీ లేదు, ఆమె చాలా మంచి నటి.
నిన్నటికి నిన్న భాగ్యశ్రీ కూడా ఇదే విషయంపై స్పందిస్తూ, రామ్ తనకు మంచి ఫ్రెండ్ మాత్రమేనని తేల్చిచెప్పింది. ఇద్దరి క్లారిటీతో రూమర్లకు చెక్ పడినట్లే. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ హిట్ కొడుతుందో చూడాలి.

.webp)