Aditya Dhar: పదేళ్లలో నా బావమరిదే ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్.. 'ధురంధర్' దర్శకుడి సంచలన వ్యాఖ్యలు!
'ఉరి: ది సర్జికల్ స్ట్రైక్' చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్.. ఇటీవల వచ్చిన 'ధురంధర్' సినిమాతో ఏకంగా పాన్ ఇండియాస్ మోస్ట్ క్రేజీయెస్ట్ డైరెక్టర్ల లిస్ట్‌లో చేరిపోయారు. ప్రస్తుతం ఆయన తదుపరి భారీ చిత్రం ‘ధురంధర్ 2’ ఎల్లుండి (మార్చి 19న) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ హడావిడిలో బిజీగా ఉన్న ఆదిత్య ధర్.. తాజాగా తన వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను పంచుకుంటూ చేసిన ఒక ఆసక్తికరమైన ప్రకటన ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
యామీ గౌతమ్ తమ్ముడిపై ప్రశంసలు..
తన భార్య, ప్రముఖ బాలీవుడ్ నటి యామీ గౌతమ్ సోదరుడైన 'ఓజస్ గౌతమ్' (Ojas Gautam) గురించి ఆదిత్య ధర్ ఎంతో నమ్మకంగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన బావమరిది ఓజస్ గౌతమ్ ప్రతిభపై తనకు అపారమైన నమ్మకం ఉందని ఆయన స్పష్టం చేశారు.
నాది పూచీ అంటున్న స్టార్ డైరెక్టర్
"వచ్చే పదేళ్లలో, భారతదేశంలోనే అత్యంత ప్రతిభావంతుడైన బిగ్గెస్ట్ డైరెక్టర్‌గా ఓజస్ అవతరిస్తాడు. ఓజస్‌ను దేశంలోనే బెస్ట్ డైరెక్టర్‌గా తీర్చిదిద్దే పూర్తి బాధ్యతను నేను తీసుకుంటాను. అందుకు నా వంతుగా వంద శాతం కృషి చేస్తాను" అని ఆదిత్య ధర్ కాన్ఫిడెంట్‌గా చెప్పారు. ప్రస్తుతం ఆదిత్య ధర్ పర్యవేక్షణలోనే ఓజస్ దర్శకత్వంలో మెళకువలు నేర్చుకుంటున్నట్లు సమాచారం.
ఇండస్ట్రీలో మొదలైన చర్చ
ఒక స్టార్ డైరెక్టర్ స్థాయికి ఎదిగిన వ్యక్తి నుంచి ఇలాంటి బహిరంగ ప్రశంసలు రావడం అంటే ఓజస్ గౌతమ్‌లో కచ్చితంగా ఏదో బలమైన విషయం (స్టఫ్) ఉందనే చర్చ ఇండస్ట్రీలో మొదలైంది. మరి ఈ యంగ్ టాలెంట్ భవిష్యత్తులో తన బావ ఆదిత్య ధర్‌లాగే ఇండియన్ బాక్సాఫీస్‌ను ఏ స్థాయిలో ఏలుతాడో చూడాలి.

