Global Oil Market Report: ట్రంప్ 'శాంతి' మంత్రం.. పేకమేడలా కుప్పకూలిన చమురు ధరలు.. ఇరాన్ ట్విస్ట్‌తో మార్కెట్లలో కల్లోలం!
పశ్చిమాసియా అగ్నిగుండంలో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అకస్మాత్తుగా చదివిన 'శాంతి' మంత్రం.. ప్రపంచ చమురు మార్కెట్లలో కనీవినీ ఎరుగని సునామీ సృష్టించింది. "ఇరాన్‌తో యుద్ధానికి బ్రేక్ ఇస్తున్నాం.. ఐదు రోజుల పాటు దాడులు ఆపేస్తున్నాం.. మా మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి" అంటూ ట్రంప్ చేసిన సంచలన ప్రకటన వెలువడిన క్షణాల్లోనే.. ఆకాశాన్నంటిన గ్లోబల్ ముడిచమురు ధరలు పేకమేడలా కుప్పకూలాయి. యుద్ధ భయాలతో ఇన్నాళ్లూ వణికిపోయిన మార్కెట్లు, ట్రంప్ మాటలతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాయి.
పాతాళానికి క్రూడ్ ఆయిల్.. నిమిషాల్లోనే మహా విధ్వంసం
ట్రంప్ నోటి నుంచి ఆ మాట వచ్చిన వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఏకంగా 13 శాతానికి పైగా పాతాళానికి పడిపోయాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ధర సుమారు 17 డాలర్లు (15 శాతం) మేర పతనమై, సెషన్ కనిష్ట స్థాయి అయిన 96 డాలర్లకు పడిపోయి మార్కెట్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. అటు అమెరికన్ మార్కెట్లోనూ ఇదే రకమైన విధ్వంసం కనిపించింది. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ ఆయిల్ ధర 13 డాలర్లు (సుమారు 13.5 శాతం) మేర దిగజారిపోయి 85.28 డాలర్ల కనిష్టానికి చేరుకుంది. నిమిషాల వ్యవధిలో జరిగిన ఈ పరిణామంతో ఆయిల్ ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
ఇరాన్ అనూహ్య ట్విస్ట్.. మళ్లీ భగ్గుమన్న చమురు మంటలు
అయితే, ఈ శాంతి నాటకానికి ఇరాన్ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. అమెరికాతో అసలు ఎలాంటి శాంతి చర్చలూ జరగలేదని, ఇదంతా పచ్చి అబద్ధమని టెహ్రాన్ కుండబద్దలు కొట్టడంతో.. చల్లారిన చమురు మంటలు మళ్లీ భగ్గుమన్నాయి. ఇరాన్ ఖండనతో కుప్పకూలిన చమురు ధరలు వెంటనే సుమారు 5 శాతం మేర ఎగబాకి బ్యారెల్‌కు 101 డాలర్లకు చేరుకున్నాయి. ఆ తర్వాత మార్కెట్లలో నెలకొన్న గందరగోళ వాతావరణం నడుమ మళ్లీ 100 డాలర్ల దిగువకు పడిపోయి తీవ్ర ఒడిదుడుకుల మధ్య ఊగిసలాడుతున్నాయి.
30 రోజుల మహాసంగ్రామం.. 70 నుంచి 112 డాలర్ల దాకా!
వాస్తవానికి, అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్‌తో ప్రత్యక్ష యుద్ధానికి దిగిన నాటి నుంచి బ్రెంట్ క్రూడ్ ధరలు ఏకంగా 60 శాతానికి పైగా పెరిగిపోయాయి. యుద్ధ మేఘాలు కమ్ముకోక ముందు బ్యారెల్ చమురు ధర సగటున 70 డాలర్ల వద్ద ప్రశాంతంగా ఉండేది. కానీ, ప్రపంచ ఇంధన రవాణాకు గుండెకాయ లాంటి హార్ముజ్ జలసంధి మూసుకుపోవడం, గల్ఫ్ ప్రాంతంలోని కీలక ఇంధన కేంద్రాలపై బాంబుల వర్షం కురవడంతో.. సోమవారం నాటికి బ్యారెల్ ధర ఏకంగా 112 డాలర్ల ఆకాశాన్నంటింది. కేవలం గత 30 రోజుల్లోనే ముడి చమురు మార్కెట్ ఎన్నడూ చూడని చారిత్రక గరిష్టాలను నమోదు చేయగా, ఇప్పుడు అగ్రరాజ్యాల ఎత్తుగడలతో అనూహ్య పతనాన్ని చవిచూస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుని ఆడిస్తోంది.
Also Read:
Global Energy Crisis: ఇంధన కరువుతో అల్లాడుతున్న ప్రపంచం!Israel Attacks Tehran: ట్రంప్ మాటలకే పరిమితం.. టెహ్రాన్‌పై బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్!
Trump Halts Iran Strikes: ఇరాన్ పై దాడులు ఆపిన ట్రంప్
Middle East War: అమెరికాకు ఇరాన్ సీ-మైన్స్ వార్నింగ్
Iran 6 Demands to US Israel : అగ్నిగుండంలో అగ్రరాజ్యాలు.. యుద్ధం ఆగాలంటే ఇరాన్ విధించిన ఆరు బ్రహ్మాస్త్రాలు ఇవే!

