ముంబై ఫిల్మ్ సిటీ.. కెమెరాల ఫ్లాష్‌లు, యాక్షన్ డైరెక్టర్ల అరుపులు, గాల్లోకి ఎగిరే కార్లు.. వీటన్నింటి మధ్య కడుపుబ్బా నవ్వించే డైలాగులు! బాలీవుడ్ మాస్ డైరెక్టర్ రోహిత్ శెట్టి సెట్ అంటేనే అదొక పండగ వాతావరణం. ఇప్పుడు ఆ సెట్‌లో మునుపెన్నడూ లేని సరికొత్త సందడి వాతావరణం నెలకొంది. ఇండియన్ బాక్సాఫీస్‌ను నవ్వుల ఉప్పెనలో ముంచెత్తిన ఐకానిక్ కామెడీ ఫ్రాంచైజీ 'గోల్ మాల్' ఐదో విడత (Golmaal 5) షూటింగ్ అక్కడ శరవేగంగా జరుగుతోంది. పాత గ్యాంగ్‌తో పాటు సరికొత్త స్టార్స్ ఈ సెట్‌లో అడుగుపెట్టడంతో ముంబై సినీ వర్గాల్లో ఇప్పుడు ఎక్కడ విన్నా గోల్ మాల్ గురించే చర్చ నడుస్తోంది.
కమ్ బ్యాక్ ఇస్తున్న పాత గ్యాంగ్..
గోల్ మాల్ అనగానే ముందుగా గుర్తొచ్చేది ఆ ఐకానిక్ క్యారెక్టర్లే. గోపాల్‌గా అజయ్ దేవగన్, మాధవ్‌గా అర్షద్ వార్సీ, మాటలు రాని లక్కీగా తుషార్ కపూర్, లక్ష్మణ్ పాత్రల్లో శ్రేయస్ తల్పాడే, కునాల్ ఖేము తమ అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కట్టిపడేశారు. 2006లో 'గోల్ మాల్: ఫన్ అన్ లిమిటెడ్'తో మొదలైన ఈ నవ్వుల ప్రయాణం.. ఆ తర్వాత వచ్చిన గోల్ మాల్ రిటర్న్స్, గోల్ మాల్ 3, గోల్ మాల్ అగెయిన్‌తో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడు ఐదో భాగంలో పాత గ్యాంగ్‌తో పాటు, తొలి భాగంలో ప్రేక్షకులను అలరించిన శర్మన్ జోషి కూడా మళ్లీ గ్రాండ్ రీఎంట్రీ ఇస్తుండటం సినిమాపై అంచనాలను అమాంతం పెంచేస్తోంది.
కరీనా అవుట్.. మిల్కీ బ్యూటీ ఇన్!
గోల్ మాల్ సిరీస్‌లో హీరోయిన్ కరీనా కపూర్ ముద్ర అంతా ఇంతా కాదు. 'గోల్ మాల్ రిటర్న్స్'లో అజయ్ భార్య ఏక్తాగా, 'గోల్ మాల్ 3'లో టాంబాయ్ డబుగా ఆమె పండించిన హాస్యం సిరీస్‌కే హైలైట్. ప్రెగ్నెన్సీ వల్ల నాలుగో భాగంలో ఆమె కనిపించలేదు. అయితే, ఇప్పుడు గోల్ మాల్ 5లో రోహిత్ శెట్టి అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు. కరీనా కపూర్ స్థానంలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాను అజయ్ దేవగన్‌కు జోడీగా రంగంలోకి దించినట్లు బి-టౌన్ అంతర్గత వర్గాలు కోడై కూస్తున్నాయి. గ్లామర్‌తో పాటు కామెడీ టైమింగ్ ఉన్న తమన్నా ఎంట్రీతో ఈ ప్రాజెక్ట్‌కు సరికొత్త కలర్ యాడ్ అయ్యింది.
బట్టతలతో అక్షయ్ సర్ ప్రైజ్.. ప్రియమణి ఎంట్రీ
కథ పరంగా ఈసారి గోల్ మాల్ 5 ఒక 'ట్రెజర్ హంట్' కామెడీ అడ్వెంచర్‌గా తెరకెక్కబోతోంది. నిధి వేటలో సాగే ఈ హాస్య ప్రయాణంలో బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ అత్యంత విలక్షణమైన పాత్రలో ఎంట్రీ ఇస్తున్నారు. అది కూడా పూర్తి బట్టతల లుక్‌లో, ఒక సర్‌ప్రైజింగ్ నెగటివ్ షేడ్ ఉన్న విలన్ పాత్రలో అక్షయ్ కనిపిస్తారన్న వార్త అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. అంతేకాకుండా, సౌత్ సెన్సేషన్ ప్రియమణి కూడా ఈ సినిమాలో అక్షయ్ కుమార్‌కు జోడీగా ఒక కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. గతంలో 'ఎంటర్‌టైన్‌మెంట్' సినిమాలో కలిసి సందడి చేసిన అక్షయ్-తమన్నా ద్వయం, ఇప్పుడు గోల్ మాల్ సెట్‌లో మళ్లీ ఎదురుపడటం మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టరుగా మారింది.
రోహిత్ శెట్టి మార్క్ యాక్షన్, అదిరిపోయే కామెడీ మిక్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ముంబైలో పగలు రాత్రి తేడా లేకుండా సాగుతోంది. పాత ఐకానిక్ గ్యాంగ్, విలన్‌గా అక్షయ్, హీరోయిన్లుగా తమన్నా, ప్రియమణుల కాంబినేషన్‌లో వస్తున్న 'గోల్ మాల్ 5'.. 2027లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రికార్డులు సృష్టిస్తుందో లేదో చూడాలి.
Also Read:
Pawan Kalyan Fans Attack: "సినిమా బాగాలేదు కాకా" అన్నందుకు పిడిగుద్దులు.. పవన్ ఫ్యాన్స్ వీరంగం!Gaddar Awards 2025: హైదరాబాద్ గడ్డపై కమల్ ఎమోషనల్ స్పీచ్.. చిరుతో బంధంపై ఆసక్తికర వ్యాఖ్యలు!
Gaddar Cine Awards 2025: తెలంగాణ కోడలిని.. నన్ను ఆదరించండి: వేదికపై రష్మిక ఎమోషనల్!
Kantara Controversy: సొంత సినిమాకే షాక్ ఇచ్చిన రిషబ్ శెట్టి
Megastar Chiranjeevi Latest: బ్లడ్ బ్యాంక్ తర్వాత మరో మహాత్కార్యం.. పేదలకు ఉచిత విద్య
Dhurandhar 2 Records: పుష్ప 2 రికార్డు బ్రేక్
Ustaad Bhagat Singh Review: ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ, రేటింగ్

