Ustaad Bhagat Singh Review: రొటీన్ ఫార్ములాతో వచ్చిన 'ఉస్తాద్'.. పవన్ కళ్యాణ్ మూవీ రివ్యూ, రేటింగ్ ఇదీ!
14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. భారీ అంచనాల మధ్య ఒక పక్కా కాప్ యాక్షన్ డ్రామాగా ఈరోజు (మార్చి 19న) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కథేంటి, పవన్ కళ్యాణ్ తన ట్రేడ్ మార్క్ యాక్షన్‌తో ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించారో ఈ రివ్యూలో చూద్దాం.
అసలు కథేంటంటే..
తెలంగాణ ముఖ్యమంత్రి కావాలని తీవ్రంగా కలలు కనే చదల మర్రి నల్ల నాగప్ప (పార్థిబన్), ప్రస్తుత సీఎం చంద్రశేఖర్ రావు (కేఎస్ రవికుమార్)ను అంతం చేయడానికి ఒక భారీ కుట్ర పన్నుతాడు. సరిగ్గా ఇదే సమయంలో నల్లమల అడవుల్లో విహారయాత్రకు వెళ్లిన నాగప్ప కొడుకు అనుమానాస్పద స్థితిలో అదృశ్యమవుతాడు. పోలీసుల దర్యాప్తులో అతడిని కిడ్నాప్ చేసింది పోలీస్ ఆఫీసర్ ఉస్తాద్ భగత్ సింగ్ (పవన్ కళ్యాణ్) అని తేలుతుంది. అసలు ఉస్తాద్ భగత్ సింగ్ ఎవరు? నాగప్పతో అతనికి ఉన్న శత్రుత్వం ఏంటి? ఈ కిడ్నాప్ వెనుక ఉన్న అసలు లక్ష్యం ఏంటి? అన్నదే ఈ సినిమా కథ.
ట్రేడ్ మార్క్ స్టైల్.. ఫ్యాన్స్‌కు పూనకాలే!
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ అనగానే ఉన్న అంచనాలకు తగ్గట్టే.. పవన్ తనదైన ట్రేడ్ మార్క్ స్టైల్, యాక్షన్, డైలాగ్ డెలివరీతో అదరగొట్టాడు. చాలా గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ వేసిన డ్యాన్స్ స్టెప్పులు, ఎనర్జిటిక్ యాక్షన్ సీక్వెన్స్ అభిమానులను ఎంతగానో అలరిస్తాయి. విలన్‌గా పార్థిబన్ తన సెటిల్డ్ నటనతో ఆకట్టుకున్నాడు. పవన్, పార్థిబన్ మధ్య వచ్చే ఫేస్-ఆఫ్ సీన్స్ బాగా పండాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ 'తొలిప్రేమ'లోని "ఈ మనసే" పాటను రీక్రియేట్ చేయడం ఫ్యాన్స్‌కు పెద్ద ట్రీట్ అని చెప్పాలి. మహంకాళి ఫైట్ సీక్వెన్స్ సినిమాలో మేజర్ హైలైట్‌గా నిలుస్తూ పవన్ కళ్యాణ్‌ను పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేసింది. ఇక హీరోయిన్ శ్రీలీల తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకుంది. సెకండ్ హాఫ్‌లో వచ్చే యాక్షన్, పవర్ ఫుల్ డైలాగ్స్ ప్రేక్షకులను బాగా ఎంగేజ్ చేస్తాయి.
రొటీన్ ఫార్ములా.. నిరాశపరిచిన రైటింగ్
ఈ సినిమా పూర్తిగా తెలిసిన రొటీన్ కమర్షియల్ ఫార్ములాతో సాగడం అతిపెద్ద మైనస్. కథలో ఎలాంటి కొత్తదనం లేకపోగా, ఒక సేఫ్ జోన్‌లో సినిమాను నడిపించారు. దర్శకుడు హరీష్ శంకర్ బలమైన స్క్రీన్‌ప్లే మీద కాకుండా కేవలం హీరో ఎలివేషన్ల మీదే ఎక్కువ దృష్టి పెట్టాడు. దీనివల్ల ఫస్ట్ హాఫ్ చాలా సాగదీసినట్లు, బలహీనమైన రైటింగ్ మరియు వర్కౌట్ కాని కామెడీతో నిరాశపరుస్తుంది. రావు రమేష్, గౌతమి, రాశి ఖన్నా లాంటి మంచి నటీనటులను దర్శకుడు సరిగ్గా వాడుకోలేదు. ముఖ్యంగా రాశి ఖన్నా పాత్రకు సరైన ముగింపు లేక ఇన్‌కంప్లీట్‌గా అనిపిస్తుంది. థమన్ అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రొటీన్‌గా అనిపిస్తూ, గత చిత్రాల ఛాయలు కనిపిస్తాయి. సినిమాలో ఎమోషనల్ డెప్త్ కూడా పూర్తిగా లోపించింది.
టెక్నికల్ గా ఎలా ఉందంటే..
సాంకేతికంగా చూస్తే అయానాంక బోస్ సినిమాటోగ్రఫీ పర్వాలేదనిపిస్తుంది. నిర్మాణ విలువులు బాగున్నా, కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ (ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో) మరింత క్రిస్ప్‌గా ఉండాల్సింది. దర్శకుడు హరీష్ శంకర్ కు ఒక అద్భుతమైన అవకాశం ఉన్నా.. పాత ఫార్ములానే ఎంచుకుని తప్పు చేశాడు. మొత్తంగా చెప్పాలంటే.. 'ఉస్తాద్ భగత్ సింగ్' కొన్ని ఫ్యాన్ ప్లీజింగ్ మూమెంట్స్‌తో వచ్చిన రొటీన్ కమర్షియల్ యాక్షన్ డ్రామా. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ యాక్షన్ ఎపిసోడ్స్ ఫ్యాన్స్‌కు బాగా నచ్చుతాయి కానీ, ఊహించదగిన స్టోరీ, వీక్ ఫస్ట్ హాఫ్ వల్ల సామాన్య ప్రేక్షకులకు ఇది ఒక యావరేజ్ మూవీగా మాత్రమే మిగిలిపోతుంది.
రేటింగ్: 3/5
Also Read:
Dhurandhar 2 Movie Review: 4 గంటల నిడివి ఎంగేజ్ చేసిందా? రణవీర్ సింగ్ మూవీ రివ్యూ, రేటింగ్Naveen Yerneni Speech: ఉస్తాద్ భగత్ సింగ్ రిజల్ట్ పై మైత్రీ నిర్మాత కామెంట్స్
Ustaad Bhagat Singh Release: ఉగాదికి వస్తున్న పవన్ కళ్యాణ్.. ధురంధర్ తో పోటీపై డైరెక్టర్ కామెంట్స్
Ustaad Bhagat Singh: డైరెక్టర్, హీరోయిన్లకు అగ్నిపరీక్షే
RGV Twitter Review: స్పీల్ బర్గ్, నోలన్ పనులన్నీ మానేసి ధురంధర్ 2 సినిమా చూడాల్సిందే.. ఆర్జీవీ సంచలన ట్వీట్
Dhurandhar 2 Advance Bookings: 3 వేల టికెట్, ఫస్ట్ డే 250 కోట్లు!
Ram Charan Peddi Movie Updates: పెద్ది ఐటమ్ భామ ఎవరంటే?

