Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్' హిట్ అవ్వాల్సిందే.. ఆ ముగ్గురికీ ఇది అగ్నిపరీక్షే!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ సాధించిన బ్లాక్ బస్టర్ విజయం తర్వాత థియేటర్లలోకి వస్తున్న చిత్రం కావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. టాలీవుడ్‌లో ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ‘గబ్బర్ సింగ్’ కాంబినేషన్ (పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్) మళ్లీ రిపీట్ అవుతుండటంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఖచ్చితంగా సత్తా చాటుతుందని పవర్ స్టార్ ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. అయితే, ఈ సినిమా రిజల్ట్ కేవలం అభిమానులకు మాత్రమే కాకుండా.. చిత్ర దర్శకుడు, హీరోయిన్ల కెరీర్‌కు కూడా అత్యంత కీలకంగా మారింది.
ఫామ్‌లోకి రావాలని చూస్తున్న హరీష్ శంకర్
మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్‌కు ఈ సినిమా ఫలితం ఒక అగ్నిపరీక్ష లాంటిదనే చెప్పాలి. ఇటీవల మాస్ మహారాజా రవితేజతో ఆయన తెరకెక్కించిన ‘మిస్టర్ బచ్చన్’ బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలవడమే కాకుండా, ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఆ చేదు అనుభవాన్ని పక్కనపెట్టి, పవన్ కళ్యాణ్‌తో కలిసి మళ్లీ మునుపటి ఫామ్‌లోకి రావాలని ఆయన గట్టి పట్టుదలతో ఉన్నారు. ఒకవేళ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గనుక ఆశించిన స్థాయిలో హిట్ కాకపోతే, హరీష్ శంకర్ కెరీర్ తీవ్ర డైలమాలో పడే అవకాశం ఉంది. అందుకే ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆయన, ప్రమోషన్ కార్యక్రమాలను సైతం దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు.
హీరోయిన్ల కెరీర్‌కు టర్నింగ్ పాయింట్
దర్శకుడి పరిస్థితి ఇలా ఉంటే, ఈ సినిమాలో నటిస్తున్న యంగ్ సెన్సేషన్ శ్రీలీల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. అతి తక్కువ కాలంలోనే వరుస ఆఫర్లతో టాలీవుడ్‌ను ఊపేసిన ఈ బ్యూటీ, సరైన కమర్షియల్ సక్సెస్ లేక తీవ్రంగా సతమతమవుతోంది. పేరుకు క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద సరైన హిట్టు పడకపోవడంతో ఆమె కెరీర్ గ్రాఫ్ క్రమంగా పడిపోతోంది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సాలిడ్ హిట్ అయితే తప్ప.. టాలీవుడ్‌లో ఆమెకు మళ్లీ మునుపటి స్థాయిలో అవకాశాలు వచ్చే ఛాన్స్ కనిపించడం లేదు. అలాగే, ఈ చిత్రంలో మరో హీరోయిన్‌గా నటిస్తున్న రాశి ఖన్నా కూడా ఈ భారీ ప్రాజెక్టుతో తిరిగి ఫామ్‌లోకి రావాలని ఆశపడుతోంది. ఇంతమంది అదృష్టాన్ని పరీక్షించబోతున్న ఈ మాస్ ఎంటర్‌టైనర్ రేపు (మార్చి 19న) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది.
Also Read:
RGV Twitter Review: స్పీల్ బర్గ్, నోలన్ పనులన్నీ మానేసి ధురంధర్ 2 సినిమా చూడాల్సిందే.. ఆర్జీవీ సంచలన ట్వీట్Dhurandhar 2 Advance Bookings: 3 వేల టికెట్, ఫస్ట్ డే 250 కోట్లు!
Ram Charan Peddi Movie Updates: పెద్ది ఐటమ్ భామ ఎవరంటే?
Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కోసం శ్రీలీల తీసుకున్న పారితోషికం ఎంతో తెలుసా?
Ustaad Bhagat Singh Inside Talk: రిలీజ్ కు ముందే సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఇన్సైడ్ టాక్
Akshay Kumar: వెంకీ మామ మూవీ రీమేక్ కు రెడీ!
Ustaad Bhagat Singh Tickets: ఏపీలో భారీగా పవన్ మూవీ రేట్లు

