RGV Twitter Review: స్పీల్ బర్గ్, నోలన్ పనులన్నీ మానేసి ధురంధర్ 2 సినిమా చూడాల్సిందే.. ఆర్జీవీ సంచలన ట్వీట్

naveen
By -

RGV Twitter Review

RGV on Dhurandhar 2: 'షోలే' కంటే వంద రెట్లు గ్రేట్.. 'ధురంధర్ 2'పై వర్మ రివ్యూ, హాలీవుడ్ డైరెక్టర్లకు ఛాలెంజ్!


తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమలో తనదైన ట్రెండ్ సెట్ చేసిన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) తాజాగా బాలీవుడ్ మూవీ ‘ధురంధర్ 2: ది రివెంజ్’ పై ఆసక్తికరమైన రివ్యూ ఇచ్చారు. రణవీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్‌ను మంగళవారం రాత్రి ప్రత్యేకంగా వీక్షించిన వర్మ.. సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టడమే కాకుండా, ఇండియన్ సినిమాలో ఒక సరికొత్త శకానికి (New Cinematic Order) నాంది పలుకుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


క్లాసిక్స్ అన్నీ టీవీ సీరియల్స్ లా కనిపిస్తాయట!


సినిమా చూసిన అనంతరం రామ్ గోపాల్ వర్మ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తన రివ్యూను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.


"నిన్న రాత్రి నేను #Dhurandhar2 సినిమా చూశాను. ఇది అన్ని కోణాల్లో అద్భుతంగా ఉంది. ప్రేక్షకుల పరవశం, సామాజిక ప్రభావం, సినిమాటిక్ గ్రామర్‌ను బద్దలు కొట్టడం వంటి విషయాల్లో ఈ సినిమా సైకలాజికల్ ఆడియో విజువల్ ఇంపాక్ట్ ఎంతగానో ఉంటుంది. ఇది కచ్చితంగా ఇండియన్ సినిమా హిస్టరీలో 'షోలే' కంటే 100 రెట్లు ఎక్కువ ఘనత సాధిస్తుంది. 'మొఘల్-ఎ-ఆజం' నుంచి ఇప్పటివరకు వచ్చిన గొప్ప చిత్రాలన్నీ ఈ సినిమా ముందు కేవలం టీవీ సీరియల్స్‌లా కనిపిస్తాయి" అని వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.


ఈ చిత్రం గతంలో ఉన్న సినిమా ప్రపంచాన్ని కనుమరుగు చేసి, సరికొత్త ఆర్డర్‌కు పునాది వేస్తుందని ఆయన విశ్లేషించారు.


స్పీల్‌బర్గ్, నోలన్ పనులన్నీ మానేసి ఈ సినిమా చూడాలి!


డైరెక్టర్ ఆదిత్య ధర్ విజన్‌ను రామ్ గోపాల్ వర్మ ఆకాశానికెత్తేశారు. ఇకపై సినిమా ఇండస్ట్రీలో 'డైరెక్టర్' (DIRECTOR) అనే పదానికి స్పెల్లింగ్ ఆదిత్య ధర్ పేరుతోనే మొదలవుతుందని ఆయన కొనియాడారు. కేవలం ఇండియన్ సినిమాకే పరిమితం కాకుండా, హాలీవుడ్ దిగ్గజ దర్శకులైన స్టీవెన్ స్పీల్‌బర్గ్, క్రిస్టోఫర్ నోలన్ వంటి వారికి కూడా వర్మ ఒక సలహా ఇచ్చారు.


"స్టీవెన్ స్పీల్‌బర్గ్, క్రిస్టోఫర్ నోలన్ సైతం ప్రస్తుతం తాము చేస్తున్న పనులన్నీ పక్కన పెట్టేసి.. ఫస్ట్ డే ఫస్ట్ షో #Dhurandhar2 సినిమా చూడటం వారికి ఎంతో వివేకవంతమైన పని అవుతుంది" అని వర్మ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

 

ఈ రేంజ్‌లో ఆర్జీవీ ప్రశంసలు కురిపించడంతో 'ధురంధర్ 2' పై అంచనాలు మరింత తారాస్థాయికి చేరుకున్నాయి.