Ustaad Bhagat Singh Inside Talk: పవన్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. థియేటర్లోకి రాకముందే లీకైన 'ఉస్తాద్' హైలైట్స్ ఇవే!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చేసింది. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో 'గబ్బర్ సింగ్' లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'ఉస్తాద్ భగత్ సింగ్' ఇంకొన్ని గంటల్లో థియేటర్లలో భారీ స్థాయిలో సందడి చేయబోతోంది.
ఇన్‌సైడ్ టాక్.. ఆ నాలుగు ఫైట్లు అదిరిపోయాయట!
ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు సినిమాలో మాస్ ఎలిమెంట్స్ ఏ రేంజ్‌లో ఉన్నాయో స్పష్టం చేశాయి. రిలీజ్‌కు ముందే ఈ సినిమా సెన్సార్ రిపోర్ట్, ఇన్‌సైడ్ టాక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ముఖ్యంగా సినిమాలో మొత్తం నాలుగు భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండబోతున్నాయని సమాచారం. ఫస్ట్ హాఫ్‌లో రెండు, సెకండ్ హాఫ్‌లో రెండు ఫైట్స్ అభిమానులకు థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయమని టాలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. అలాగే పవన్ మార్క్ మేనరిజమ్స్‌తో డిజైన్ చేసిన హీరో ఇంట్రడక్షన్ సీన్ సినిమాకే హైలైట్‌గా నిలవనుందట.
'తొలిప్రేమ' మ్యాజిక్ రిపీట్.. ఇంటర్వెల్ బ్యాంగ్ అదుర్స్!
ఈ సినిమాలో పవన్ కెరీర్‌లోనే ఎవర్ గ్రీన్ క్లాసిక్ అయిన 'తొలిప్రేమ' చిత్రంలోని "ఈ మనసే" పాటను రీమిక్స్ చేసినట్లు వస్తున్న వార్త ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఇస్తోంది. ఈ పాట థియేటర్లలో రికార్డు స్థాయి రీసౌండ్ తెప్పించడం ఖాయమని అంటున్నారు. దీనికి తోడు ఫస్ట్ హాఫ్‌ను ముగించే ఇంటర్వెల్ బ్యాంగ్ చాలా ఎమోషనల్‌గా, పవర్ ఫుల్‌గా డిజైన్ చేశారట. సెకండ్ హాఫ్ మీద అంచనాలను అమాంతం పెంచేలా ఈ ఇంటర్వెల్ ఫైట్ ఉండబోతోందని ఇన్‌సైడ్ టాక్.
ఫ్యామిలీస్ కోసం చైల్డ్ సెంటిమెంట్.. హోరెత్తించే స్టెప్పులు
కేవలం మాస్ ఆడియన్స్‌ను మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా కట్టిపడేసేలా సెకండ్ హాఫ్‌లో ఒక అద్భుతమైన చైల్డ్ సెంటిమెంట్ ఎపిసోడ్ ఉంటుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఎమోషనల్ ట్రాక్ సినిమాకు ప్రాణం పోస్తుందని అంటున్నారు. ఇక చివరగా 'దేఖ్ లేంగే సాలా' సాంగ్‌లో పవన్ వేసిన మాస్ స్టెప్పులు థియేటర్లను హోరెత్తించడం పక్కా అని సమాచారం. మొత్తానికి పవన్ ఫ్యాన్స్‌కు ఉస్తాద్ భగత్ సింగ్ రూపంలో ఒక కంప్లీట్ ఫుల్ మీల్స్ దొరకబోతోందని ఇన్‌సైడ్ టాక్ చెబుతున్నప్పటికీ, అసలు ప్రేక్షకుల తీర్పు ఏంటన్నది రేపు ఉదయం షోలు పడితే కానీ పూర్తిగా తేలిపోదు.
Also Read:
Ustaad Bhagat Singh Tickets: ఏపీలో భారీగా పవన్ మూవీ రేట్లుPawan Kalyan: మోహన్ రాజాతో పవన్ మూవీ.. రూమర్లకు చెక్!
Ustaad Bhagat Singh: పవన్, చిరుపై హరీష్ శంకర్ కామెంట్స్
Ustaad Bhagat Singh: తమన్ బీజీఎమ్‌పై హరీష్ ట్వీట్
రూమర్లకు చెక్.. పవన్ కళ్యాణ్ కు త్రివిక్రమ్ దూరంగా ఉండటానికి మెయిన్ రీజన్ అదే
Ustaad Bhagat Singh: పవన్ పోలీస్ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?
Ustaad Bhagat Singh Box Office: హిట్ కావాలంటే ఎన్ని కోట్లు రావాలి? పవన్ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్

