Dhurandhar 2 Review: 4 గంటల రణవీర్ సింగ్ మాస్ జాతర.. 'ధురంధర్ 2' మూవీ రివ్యూ!
రణవీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ ‘దురంధర్’కు సీక్వెల్‌గా వచ్చిన ‘ధురంధర్ 2: ది రివెంజ్’ ఉగాది కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిగతా పాన్ ఇండియా సినిమాలతో పోలిస్తే ఈ భారీ యాక్షన్ సీక్వెల్‌ను మేకర్స్ చాలా త్వరగానే పూర్తి చేసి రిలీజ్ చేశారు. అయితే ఒకరోజు ముందుగానే ప్లాన్ చేసిన తెలుగు, తమిళ ప్రీమియర్ షోలు కంటెంట్ డెలివరీ ఇష్యూ వల్ల కాన్సిల్ అయినప్పటికీ, హిందీ వెర్షన్ షోలు మాత్రం అన్ని రాష్ట్రాల్లో గ్రాండ్‌గా ప్రదర్శితమయ్యాయి. ఒకే భాషలో వెయ్యి కోట్లు కొల్లగొట్టిన సినిమాకు సీక్వెల్ కావడంతో భారీ అంచనాలతో వచ్చిన ఈ సెకండ్ పార్ట్ ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.
అసలు కథ ఏంటంటే..
భారత్‌కు చెందిన జస్‌ప్రీత్ సింగ్ రంగీ.. పాకిస్థాన్ వెళ్లి అక్కడ ‘ల్యారీ’ అనే పట్టణంలో హంజా అలీగా ఎలా మారాడు, రెహమాన్ డికాయిట్ (అక్షయ్ ఖన్నా) గ్యాంగ్‌లో చేరి అతన్ని ఎలా మట్టుబెట్టాడు అనేది ఫస్ట్ పార్ట్‌లో చూశాం. ఇక ఈ సెకండ్ పార్ట్‌లో జస్‌ప్రీత్ అసలు ఈ అండర్ కవర్ ఆపరేషన్‌లోకి ఎలా ఎంటర్ అయ్యాడనే నేపథ్యంతో కథ మొదలవుతుంది.
రెహ్మాన్ మరణం తర్వాత ఆ స్థానానికి రాబోయిన అర్షద్ పప్పును దారుణంగా చంపించిన హంజా.. తనకు అడ్డుగా ఉన్న ఉజైర్‌ను తప్పుడు కేసులో ఇరికించి దుబాయ్‌లో అరెస్ట్ చేయిస్తాడు. ఆ తర్వాత భారత్‌పై పాకిస్థాన్ ఐఎస్ఐ వేసిన కుట్రలను ఒక్కొక్కటిగా తిప్పికొడతాడు. ఈ క్రమంలో ఐఎస్ఐ మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్)కు హంజా ఒక ఇండియన్ అనే నిజం తెలుస్తుంది. అప్పుడు హంజాని అతను ఎలా అడ్డుకున్నాడు? దానికి హంజా ఎలా చెక్ పెట్టాడు? అన్నదే ఈ సినిమా అసలు కథ.
4 గంటల నిడివి.. అదిరిపోయే ట్విస్టులు
ఉరి, దురంధర్ పార్ట్ 1 లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన డైరెక్టర్ ఆదిత్య ధర్.. ఈ సీక్వెల్ అంచనాలను అందుకోవడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు. జస్‌ప్రీత్ సింగ్ రంగీ.. హంజా అలీగా ఎలా మారాడన్న సస్పెన్స్‌ను సినిమా చివరి వరకు లాగకుండా, మొదటి పావుగంటలోనే రివీల్ చేసి డైరెక్టర్ అందరికీ షాక్ ఇచ్చాడు.
ఆ తర్వాత హంజా.. ల్యారీ, కరాచీ, బలూచ్ ప్రాంతాలకు ఎలా కింగ్‌గా ఎదిగాడన్నది ఎంతో ఆసక్తికరంగా చూపించారు. ఏకంగా నాలుగు గంటల నిడివి ఉన్న ఈ సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా డైరెక్టర్ చాలా పక్కాగా స్క్రీన్‌ప్లే రాసుకున్నాడు. ఫస్ట్ పార్ట్‌లో ఉన్నంత రక్తపాతం ఇందులో లేకపోయినా.. దావూద్ ఇబ్రహీంతో పాటు భారత్‌లో జరిగిన ఎన్నో బాంబు పేలుళ్ల సూత్రధారులను కనెక్ట్ చేస్తూ కథ నడపడం ఆడియన్స్‌కు బాగా కిక్ ఇస్తుంది.
ఇక క్లైమాక్స్ లో ఊహించని క్యారెక్టర్‌తో ఇచ్చిన ట్విస్ట్ మాత్రం మైండ్ బ్లోయింగ్ అని చెప్పొచ్చు. మొత్తంగా యాక్షన్, ఎమోషన్స్ కలగలిపిన పైసా వసూల్ ఎంటర్‌టైనర్‌గా సినిమాను తీర్చిదిద్దారు.
రణవీర్ వన్ మ్యాన్ షో.. సంజయ్ దత్ అరుపులు
నటీనటుల విషయానికొస్తే రణవీర్ సింగ్ మరోసారి హంజా అలీ క్యారెక్టర్‌లో పరకాయ ప్రవేశం చేశాడు. తన యాక్టింగ్, స్వాగ్‌తో వన్ మ్యాన్ షో చేశాడు. సంజయ్ దత్ కనిపించిన ప్రతిసారి స్క్రీన్ మీద ఆడియన్స్ అరుపులు ఖాయం. రాకేష్ బేడీ తనదైన నటనతో ఇరగదీశాడు. విలనిజంలో అర్జున్ రాంపాల్, అలాగే మాధవన్, గౌరవ్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
ఫస్ట్ పార్ట్‌తో పోలిస్తే సారా అర్జున్ పాత్ర ఇందులో చాలా తక్కువే. ఇక టెక్నికల్ టీమ్ విషయానికొస్తే, శాశ్వత్ సచ్‌దేవ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను వేరే లెవల్‌కు తీసుకెళ్లింది. వికాస్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఓజెస్ గౌతమ్ శివకుమార్ అందించిన అడిషనల్ స్క్రీన్ ప్లే సినిమాకు బాగా ప్లస్ అయింది. నిడివి కొంచెం ఎక్కువన్న కంప్లైంట్ ఉన్నా.. కంటెంట్ ఎంగేజింగ్‌గా ఉండటంతో అది పెద్ద మైనస్ అనిపించదు.
Dhurandhar 2 Rating : 3.5/5
Also Read:
RGV Twitter Review: స్పీల్ బర్గ్, నోలన్ పనులన్నీ మానేసి ధురంధర్ 2 సినిమా చూడాల్సిందే.. ఆర్జీవీ సంచలన ట్వీట్Dhurandhar 2 Advance Bookings: 3 వేల టికెట్, ఫస్ట్ డే 250 కోట్లు!
Dhurandhar 2 Remunerations: అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డ్
Ustaad Bhagat Singh Box Office: హిట్ కావాలంటే ఎన్ని కోట్లు రావాలి? పవన్ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్

