Qatar vs Iran: ఇరాన్‌పై ఖతార్ సంచలన నిర్ణయం.. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని అధికారులకు అల్టిమేటం!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇప్పుడు పరాకాష్టకు చేరుకున్నాయి. ఇప్పటికే అట్టుడుకుతున్న ఆ ప్రాంతంలో బుధవారం నాడు ఖతార్ ప్రభుత్వం తీసుకున్న ఒక సంచలన నిర్ణయం మరింత ఆజ్యం పోసింది. ఇరాన్‌కు చెందిన సైనిక మరియు భద్రతా అటాచీలను “పర్సోనా నాన్ గ్రాటా” (అవాంఛనీయ వ్యక్తులు)గా ప్రకటిస్తూ ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అల్టిమేటం జారీ చేసింది. వారంతా కేవలం 24 గంటల్లోగా తమ దేశం విడిచి వెళ్లిపోవాలని అత్యంత కఠినమైన ఆదేశాలు జారీ చేసింది.
రాస్ లఫాన్ ఎల్‌ఎన్‌జి సిటీపై భీకర దాడి
బుధవారం రాత్రి ఖతార్‌లోని అత్యంత కీలకమైన పారిశ్రామిక నగరం రాస్ లఫాన్ (Ras Laffan) పై ఇరాన్ భీకర దాడికి పాల్పడింది. ప్రపంచానికే ప్రధాన ఇంధన వనరుగా ఉన్న ఈ ఎల్‌ఎన్‌జి (LNG) సిటీపై దాడి జరగడంతో దాని ప్రభావం అంతర్జాతీయ మార్కెట్‌పై తీవ్రంగా పడింది. ఈ ఘటనతో ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు, గ్యాస్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. పశ్చిమాసియాలో ప్రస్తుతం జరుగుతున్న ఈ పరిణామాలను గమనిస్తుంటే, ఇది త్వరలోనే ఒక పూర్తి స్థాయి “ఇంధన యుద్ధం” (Energy War) గా మారే ప్రమాదం ఉందని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సార్వభౌమత్వంపై దాడి.. ఖతార్ వార్నింగ్
ఈ దాడిపై ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేస్తూ ఇరాన్ దురాగతాలను తీవ్రంగా తప్పుబట్టింది. ఇరాన్ పదేపదే ఖతార్‌ను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి దాడులకు పాల్పడటం తమ దేశ సార్వభౌమత్వాన్ని, భద్రతను దారుణంగా ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. ఇరాన్ చర్యలు అంతర్జాతీయ చట్టాలను, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం 2817ను బరితెగించి ఉల్లంఘించడమేనని ఖతార్ న్యూస్ ఏజెన్సీ (QNA) నివేదించింది.
ఇరాన్ రాయబార కార్యాలయానికి పంపిన అధికారిక లేఖలో సదరు అటాచీలకు, వారి సిబ్బందికి ఖతార్‌లో ఇకపై ఎలాంటి చోటు లేదని దోహా తేల్చి చెప్పింది. ఇరాన్ దురాక్రమణకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని, గట్టి సమాధానం ఇస్తామని తీవ్రస్థాయిలో హెచ్చరించింది. తమ జాతీయ ప్రయోజనాలను, భద్రతను కాపాడుకోవడానికి ఎంతటి కఠినమైన చర్యలకైనా వెనుకాడబోమని స్పష్టం చేసింది. అంతర్జాతీయ చట్టాల పరిధిలో తగిన రీతిలో ప్రతిస్పందించే పూర్తి హక్కు తమకు ఉందని ఖతార్ ఈ సందర్భంగా నొక్కి చెప్పింది.
Also Read:
Israel vs Iran War: ఎక్కడున్నా వదిలిపెట్టం.. మోజ్తాబా ఖమేనీకి ఇజ్రాయెల్, ట్రంప్ వార్నింగ్Indians Evacuated: స్వదేశానికి 2.44 లక్షల మంది.. తరలింపుపై కేంద్రం కీలక ప్రకటన
Dubai Economic Crisis: కుప్పకూలుతున్న దుబాయ్ ఆర్థిక వ్యవస్థ
India Condemns Pakistan: పవిత్ర రంజాన్ మాసంలో ఈ పైశాచికం ఏంటి? పాక్ వైమానిక దాడిపై భారత్ ఫైర్
US Iran War Updates: నాటో దేశాలపై డొనాల్డ్ ట్రంప్ ఫైర్.. ప్రపంచంలోనే పవర్ ఫుల్ సైన్యం మాదే అంటూ కామెంట్స్

