Middle East Crisis: పశ్చిమాసియా యుద్ధంలో ఐదుగురు భారతీయుల మృతి.. ఎంఈఏ కీలక ప్రకటన!
పశ్చిమాసియాలో రోజురోజుకూ తీవ్రమవుతున్న ఉద్రిక్త పరిస్థితులపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) తాజాగా ఒక కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఈ భీకర యుద్ధ వాతావరణంలో చిక్కుకుని ఇప్పటివరకు ఐదుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోగా, మరొకరు గల్లంతయ్యారని ఎంఈఏ అదనపు కార్యదర్శి అసీమ్ ఆర్ మహాజన్ అధికారికంగా వెల్లడించారు. ఒమన్‌లోని సోహర్ నగరంలో మృతి చెందిన ఇద్దరు భారతీయుల భౌతిక కాయాలను ఇప్పటికే రాజస్థాన్‌లోని జైపూర్‌కు తరలించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఆయన స్పష్టం చేశారు.
ముమ్మరంగా సాగుతున్న తరలింపు ప్రక్రియ
యుద్ధ ప్రభావిత ప్రాంతాల నుంచి భారతీయులను సురక్షితంగా స్వదేశానికి రప్పించే ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇరాన్ నుండి అర్మేనియా, అజర్‌బైజాన్ మార్గాల మీదుగా సుమారు 700 మంది భారతీయులు సురక్షితంగా బయటపడ్డారు. వీరిలో ఉన్న 284 మంది యాత్రికులలో 130 మంది ఈరోజు ఢిల్లీకి చేరుకోనున్నారు. తాజా గణాంకాల ప్రకారం, ఫిబ్రవరి 28వ తేదీ నుంచి ఇప్పటివరకు సుమారు 2.44 లక్షల మంది భారతీయులు ఆ ప్రాంతం నుంచి క్షేమంగా స్వదేశానికి తిరిగి వచ్చినట్లు విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది.
దౌత్యమే ఏకైక మార్గం
ప్రస్తుతం కువైట్ తమ వైమానిక మార్గాన్ని మూసివేసినప్పటికీ, సౌదీ అరేబియా మీదుగా ప్రత్యేక విమానాల ద్వారా తరలింపు ప్రక్రియను ప్రభుత్వం నిరంతరాయంగా కొనసాగిస్తోంది. యూఏఈ, ఒమన్, ఖతార్ దేశాల నుండి పరిమిత సంఖ్యలో విమానాలు నడుస్తున్నాయి. మరోవైపు ఈ యుద్ధ సంక్షోభంపై బ్రిక్స్ (BRICS) దేశాల మధ్య ఏకాభిప్రాయం సాధించడం సవాలుగా మారిందని ఎంఈఏ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అభిప్రాయపడ్డారు. ఈ సంక్షోభం వల్ల ప్రపంచ ఇంధన భద్రతపై తీవ్ర ప్రభావం పడుతుందని, కేవలం చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే ఈ యుద్ధానికి ముగింపు పలకాలని భారత్ ఐరోపా సమాఖ్య (EU) వేదికగా తేల్చి చెప్పింది. ఏది ఏమైనా విదేశాల్లో ఉన్న భారతీయుల భద్రతే తమ తొలి ప్రాధాన్యమని కేంద్ర ప్రభుత్వం మరోసారి పునరుద్ఘాటించింది.
Also Read:
Dubai Economic Crisis: కుప్పకూలుతున్న దుబాయ్ ఆర్థిక వ్యవస్థIndia Condemns Pakistan: పవిత్ర రంజాన్ మాసంలో ఈ పైశాచికం ఏంటి? పాక్ వైమానిక దాడిపై భారత్ ఫైర్
US Iran War Updates: నాటో దేశాలపై డొనాల్డ్ ట్రంప్ ఫైర్.. ప్రపంచంలోనే పవర్ ఫుల్ సైన్యం మాదే అంటూ కామెంట్స్
Kabul Airstrikes: పాక్ దాడిపై రషీద్ ఖాన్ తీవ్ర ఆగ్రహం
Mojtaba Khamenei: తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న మొజ్తబా

