పెట్రోల్ మంటలకు చెక్.. జేబులో లక్షల ఆదా: తెలంగాణలో సంచలన 'ఈవీ' విప్లవం!
రోజురోజుకూ భగ్గుమంటున్న పెట్రోల్ ధరలు ఒకవైపు.. ప్రాణాలను తోడేస్తున్న కాలుష్య కోరలు మరోవైపు! రేపు మన పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి ఏంటి? ఢిల్లీ లాంటి నరకాన్ని మన హైదరాబాద్‌లోనూ సృష్టిద్దామా? వద్దు.. ఈ పెను ముప్పును ఆపేందుకు, సామాన్యుడి జేబును, ప్రాణాన్ని కాపాడేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక సంచలన సైలెంట్ ఆపరేషన్ మొదలుపెట్టింది. పర్యావరణ పరిరక్షణతో పాటు, మీ జేబులో లక్షల రూపాయలు మిగిల్చే ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి? ఒక సామాన్యుడిగా, ఒక ఉద్యోగిగా ఈ మార్పును మనం ఎందుకు ఆహ్వానించాలి? తెలుసుకోవాల్సిన సమయమిది.
ఆటో డ్రైవర్లకు బంపర్ ఆఫర్.. సిటీలో సరికొత్త విప్లవం
నగర రోడ్లపై తిరిగే ఆటోల నుంచి వచ్చే పొగ కాలుష్యానికి ప్రధాన కారణం. దీనికి చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ఒక విప్లవాత్మక అడుగు వేసింది. ఆటో ఓనర్లపై నయా పైసా భారం మోపకుండా, పూర్తి ఖర్చులను ప్రభుత్వమే భరిస్తూ.. పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ, ఎల్పీజీ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా (ఈవీలు) మార్చే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇది కేవలం గాలిని శుభ్రపరచడమే కాదు, ఇంధన ఖర్చుల భారంతో సతమతమవుతున్న సామాన్య ఆటో వాలాల బతుకుల్లో వెలుగులు నింపే గొప్ప ముందడుగు.
ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్.. భారీగా రాయితీలు
గ్రీన్ మొబిలిటీ రంగంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలపాలని ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగానే పర్యావరణ పరిరక్షణలో ప్రభుత్వ ఉద్యోగులను రోల్ మోడల్స్‌గా నిలపాలని నిర్ణయించింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగులు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే ఏకంగా 10 నుంచి 20 శాతం వరకు ప్రత్యేక రాయితీని సర్కార్ కల్పిస్తోంది. దీనికోసం ఈవీ దిగ్గజాలైన మహీంద్రా ఎలక్ట్రిక్స్, ఏథర్ ఎనర్జీ, గ్రావిటన్ మోటార్స్, ఓలా లాంటి సంస్థలతో మాట్లాడి ఈ డిస్కౌంట్లను ఫైనల్ చేశారు. ఈ ఒక్క నిర్ణయంతో రాష్ట్రంలోని ఐదు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ఒక్కో కుటుంబం ఏకంగా రూ.4 లక్షల వరకు ఆదా చేసుకునే అద్భుత అవకాశం ఇది!
సచివాలయం సాక్షిగా కఠిన ఆదేశాలు.. పాత వాహనాలకు బ్రేక్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రభుత్వ శాఖల్లో ఇక నుంచి పెట్రోల్, డీజిల్ వాహనాల కొనుగోలుపై పూర్తి నిషేధం విధించారు. కొత్తగా ఏ వాహనం కొన్నా అది ఈవీయే అయి ఉండాలి. అంతేకాదు, హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్ - CURE) పరిధిలో ప్రభుత్వ అవసరాలకు అద్దెకు తీసుకునే వాహనాలు సైతం ఎలక్ట్రిక్ వే అయి తీరాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సచివాలయం ముందు మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, డీజీపీ బి. శివధర్ రెడ్డి, రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తీ, ఐ అండ్ పీఆర్ కమిషనర్ ప్రియాంక, మరియు ఉద్యోగ సంఘాల నేతలు ఈవీలను స్వయంగా పరిశీలించి.. ఈ ఎలక్ట్రిక్ విప్లవాన్ని ముక్తకంఠంతో ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.
తొమ్మిది వందల కోట్ల త్యాగం.. భవిష్యత్తు కోసం సర్కార్ ప్లాన్
రాష్ట్ర ఖజానాకు సుమారు రూ.900 కోట్ల భారీ ఆదాయ నష్టం వస్తున్నా సరే, పర్యావరణం కోసం ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ప్రజల భవిష్యత్తు కోసం ఈ నష్టాన్ని ధైర్యంగా భరిస్తోంది. ఈవీలు కొనేవారికి ఈ ఏడాది (2026) డిసెంబర్ వరకు రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ టాక్స్ నుంచి నూరు శాతం మినహాయింపు కల్పించింది. ఫలితంగా గతేడాది లక్షకు పైగా ఈవీలు అమ్ముడయ్యాయి. మొత్తం వాహనాల్లో ఈవీల వాటా 0.4 శాతం నుంచి 2 శాతానికి పెరగడం ఈ పాలసీ విజయానికి సజీవ సాక్ష్యం.
శరవేగంగా మౌలిక సదుపాయాలు.. తుక్కు కిందకు పాత బండ్లు
ఛార్జింగ్ కష్టాలు లేకుండా అన్ని ప్రాంతాల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు చురుగ్గా సాగుతోంది. రెడ్కో ద్వారా వీటిని మరింతగా విస్తరిస్తున్నారు. క్యూర్ (CURE) ప్రాంతంలో ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెడుతున్నాయి. డీజిల్ ఆటోలను రిట్రోఫిట్ చేసి ఈవీలుగా మారుస్తున్నారు. పర్యావరణానికి ముప్పుగా మారిన 15 ఏళ్లు దాటిన పెట్రోల్, డీజిల్ వాహనాలను నిర్దాక్షిణ్యంగా తుక్కుకు (స్క్రాప్) తరలిస్తున్నారు. అలాగే, వాహన్ పోర్టల్ ద్వారా ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా, నేరుగా షోరూమ్‌లోనే వాహనాల రిజిస్ట్రేషన్ చేసుకునే సులభమైన సౌకర్యాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.
హైదరాబాద్‌ను కాపాడుకుందాం..
తెలంగాణ మొత్తం జనాభాలో ఏకంగా 30 శాతం మంది కేవలం హైదరాబాద్ నగరంలోనే జీవిస్తున్నారు. గాలి, నీటి కాలుష్యాన్ని అరికట్టి 'క్లీన్ అండ్ గ్రీన్ తెలంగాణ'ను సాధించడమే అంతిమ లక్ష్యమని సీఎస్ రామకృష్ణారావు స్పష్టం చేశారు. ప్రతి ఏటా కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఢిల్లీ లాంటి పరిస్థితులు మన నగరానికి రాకుండా అడ్డుకోవాలంటే, ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా అడుగు కలపాలి. రాబోయే రోజుల్లో శిలాజ ఇంధనాల శకం ముగియబోతోంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు సర్కార్ ఇస్తున్న ఈ ఇన్సెంటివ్‌లను సద్వినియోగం చేసుకుని పర్యావరణ పరిరక్షణలో హీరోలుగా నిలవాలి. కరెంట్ బండికి మారదాం.. కాలుష్యాన్ని తరిమేద్దాం!
Also Read:
కన్నవారిని వదిలేస్తే జీతం కట్: తెలంగాణ సర్కార్ సంచలన బిల్లు!హైకోర్టులో ఫిరాయింపుల హైడ్రామా: దానం నాగేందర్‌కు ఊహించని షాక్.. స్పీకర్ తీర్పుపై కమలం న్యాయపోరాటం!
Telangana Rythu Bharosa : నర్మెట సాక్షిగా అన్నదాతల ఖాతాల్లోకి రైతుభరోసా నిధులు.. రేవంత్ సర్కార్ రైతు పండుగ!
Driving License New Rules : నెత్తురోడుతున్న రహదారులకు చెక్.. ఏప్రిల్ నుంచి డ్రైవింగ్ లైసెన్స్ దక్కాలంటే చుక్కలు చూడాల్సిందే!
Telangana Defection Politics: దానం మెడపై అనర్హత కత్తి.. స్పీకర్ తీర్పును సవాల్ చేస్తూ ఏలేటి పిటిషన్

