దొంగతనం చేయడం అంత సులువైన విషయం కాదండి. దానికి ఎంతో అనుభవం ఉండాలి. మనవాళ్లు ఇంటికి పెద్ద తాళాలు వేస్తుంటారు. ప్రస్తుత కాలంలో రకరకాల తాళాలు అందుబాటులో ఉన్నాయి. వాటిని తెరవడం కొంచెం కష్టమే. అందుకే దొంగలు కూడా కొత్త ఆలోచనలతో దొంగతనాలకు పాల్పడుతుంటారు. ఇక్కడ ఒక దొంగ ఎంత గట్టి తాళాన్నైనా క్షణాల్లో తెరిచేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ దొంగ తాళం తెరిచిన విధానానికి నెటిజన్లు షాక్ అవుతున్నారు.
పోలీసుల విచారణలో బయటపడ్డ ట్రిక్
ఈ వీడియోలో దొంగతనాలు చేస్తున్న ఒక దొంగను పోలీసులు పట్టుకున్నారు. ఈ దొంగ ఇంత గట్టి తాళాలను ఎలా తెరుస్తున్నాడో తెలుసుకోవాలనుకున్న పోలీసులు అతన్ని విచారించారు. విచారణలో భాగంగా ఒక ఇంటి తాళం తెరిచి చూపించమని పోలీసులు అడగగా, అతను ఒక ట్రిక్ ఉపయోగించి తాళం తెరిచాడు. ఆ టెక్నిక్ చూసి పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. "ఇదేం ట్రిక్ రా బాబు" అని అనుకున్నారు. ఇంతకీ ఆ దొంగ ఉపయోగించిన ట్రిక్ ఏమిటో తెలిస్తే, మీ ఇంటి తాళం పోయినప్పుడు మీరు కూడా అదే ప్రయత్నించవచ్చు.
పెట్రోల్, నిప్పుతో సింపుల్‌గా తాళం ఓపెన్
ఆ దొంగ తాళం తెరవడానికి ఒక సిరంజ్‌లో పెట్రోలు నింపి తాళం రంధ్రంలోకి ఇంజెక్ట్ చేశాడు. అలాగే తాళం పైన ఉండే రింగ్‌లాంటి దానికి రెండువైపులా కూడా పెట్రోలు ఇంజెక్ట్ చేశాడు. తర్వాత అగ్గిపెట్టె తీసుకొని ఆ తాళం రంధ్రంలో నిప్పు పెట్టాడు. దాంతో చిన్న మంట వచ్చింది. అలా పెట్రోలు మొత్తం అయిపోయే వరకు మంటలు వచ్చి ఆరిపోయాయి. తర్వాత ఆ తాళాన్ని పట్టుకొని జస్ట్ అలా లాగాడు. అంతే సింపుల్‌గా తాళం ఊడిపోయింది.
వైరల్ అవుతున్న వీడియో - నెటిజన్ల షాకింగ్ కామెంట్లు
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే ఈ వీడియోను మూడున్నర లక్షల మందికి పైగా చూశారు. వేలల్లో లైక్‌లు వస్తున్నాయి. ఈ దొంగ ట్రిక్ మామూలుగా లేదుగా అంటూ నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
0 కామెంట్లు