మేషం (Aries)
ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థికంగా మంచి బలం చేకూరుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సమాజ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార మరియు ఉద్యోగాలలో నూతనోత్సాహం ఉంటుంది. మీ ప్రయత్నాలకు మంచి ఫలితం లభిస్తుంది.
వృషభం (Taurus)
ఈ రాశి వారికి చిన్ననాటి స్నేహితులతో కలయిక ఉంటుంది. విందులు మరియు వినోదాలలో పాల్గొంటారు. మీరు చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయి. అందరినీ ఆకట్టుకునేలా ఉంటారు. వాహనం కొనుగోలు చేసే యోగం ఉంది. వృత్తి మరియు వ్యాపారాలు మీకు అనుకూలంగా ఉంటాయి.
మిథునం (Gemini)
ఈ రాశి వారు ఈ రోజు రుణాల కోసం ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కొన్ని ఒప్పందాలలో అవాంతరాలు ఎదురుకావచ్చు. మీ సోదరులతో కలహాలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. వ్యాపార మరియు ఉద్యోగాలు నెమ్మదిగా సాగుతాయి.
కర్కాటకం (Cancer)
ఈ రాశి వారికి బాధ్యతలు పెరిగి ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మీ ఆలోచనలు స్థిరంగా ఉండవు. మీరు ఎంత కష్టపడినా ఆశించిన ఫలితం ఉండదు. విద్యార్థులకు నిరాశ ఎదురవుతుంది. వృత్తి మరియు వ్యాపారాలు మందగిస్తాయి.
సింహం (Leo)
ఈ రాశి వారు గతంలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటారు. ఆస్తికి సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. వాహన సౌఖ్యం ఉంటుంది. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి మరియు వ్యాపారాలు మీకు మరింత సానుకూలంగా ఉంటాయి.
కన్య (Virgo)
ఈ రాశి వారు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆస్తుల విషయంలో ఉన్న చిక్కులు తొలగిపోతాయి. మీ సోదరులతో సఖ్యతగా ఉంటారు. విందులు మరియు వినోదాలలో పాల్గొంటారు. మీ పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార మరియు ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
తుల (Libra)
ఈ రాశి వారి అంచనాలు తప్పుతాయి. చేపట్టిన పనులు ముందుకు సాగవు. ఆస్తికి సంబంధించిన వివాదాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. మీ సోదరులు మరియు మిత్రులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపార మరియు ఉద్యోగాలు మందగిస్తాయి.
వృశ్చికం (Scorpio)
ఈ రాశి వారికి రుణ బాధలు తప్పవు. ఊహించని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆరోగ్యం బాగోలేకపోవచ్చు. బంధువులతో అకారణంగా తగాదాలు వచ్చే అవకాశం ఉంది. మీరు ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది. వ్యాపార మరియు ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.
ధనుస్సు (Sagittarius)
ఈ రాశి వారికి కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. శుభవార్తలు వింటారు. మీరు తీసుకున్న రుణాలు తీరుస్తారు. ప్రయాణాలు సాఫీగా సాగుతాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు. వృత్తి మరియు వ్యాపారాలలో పురోగతి ఉంటుంది.
మకరం (Capricorn)
ఈ రాశి వారి వ్యవహారాలు నెమ్మదిగా సాగుతాయి. పనిభారం మరింత పెరుగుతుంది. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కొన్ని ఒప్పందాలు వాయిదా పడతాయి. కుటుంబంలో సమస్యలు ఉంటాయి. వ్యాపార మరియు ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.
కుంభం (Aquarius)
ఈ రాశి వారికి పనుల్లో కొంత ఆలస్యం జరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగానే ఉంటాయి. కుటుంబంలో కొన్ని సమస్యలు ఉంటాయి. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆరోగ్యం సహకరించదు. వ్యాపార మరియు ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.
మీనం (Pisces)
ఈ రాశి వారు ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆత్మీయులతో మాటపట్టింపులు ఉంటాయి. కొత్తగా రుణాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. మానసిక అశాంతి ఉంటుంది. కుటుంబంలో ఒత్తిడి ఉంటుంది. వృత్తి మరియు వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.