ఎలాన్ మస్క్ కొడుకు పేరులో భారతీయ పదం ఉందంటే నమ్ముతారా? అది కూడా మన దేశానికి చెందిన ఓ నోబెల్ విజేత పేరును మస్క్ తన బిడ్డకు పెట్టుకున్నాడట!
టెస్లా బాస్ ఎలాన్ మస్క్ తన పర్సనల్ లైఫ్ గురించి ఓ ఆసక్తికరమైన సీక్రెట్ బయటపెట్టారు. జెరోధా ఫౌండర్ నిఖిల్ కామత్‌తో జరిగిన 'పీపుల్ బై డబ్ల్యూటీఎఫ్' పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ, తన కుటుంబానికి ఇండియాకు ఉన్న లింక్ ఏంటో వివరించారు. తన పార్ట్నర్, న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్ అయిన శివోన్ జిలిస్ (Shivon Zilis) సగం భారతీయురాలని మస్క్ వెల్లడించారు. అందుకే తమ కుమారుల్లో ఒకరికి 'శేఖర్' (Shekhar) అని మధ్య పేరుగా (Middle Name) పెట్టారట.
ఈ పేరు వెనుక ఉన్న అసలు కారణం ఇదే:
భారత సంతతికి చెందిన ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ గౌరవార్థం ఈ పేరును ఎంచుకున్నారు.
నక్షత్రాల పరిణామ క్రమంపై చేసిన విశేష పరిశోధనలకు గానూ చంద్రశేఖర్ 1983లో నోబెల్ బహుమతి అందుకున్నారు.
ఆయన మేధస్సుకు ఫిదా అయిన మస్క్, ఆ పేరును తన కొడుకుకు పెట్టుకుని గౌరవించారు.
శివోన్ జిలిస్ ఎప్పుడైనా ఇండియాలో ఉన్నారా అని అడిగితే, ఆమె కెనడాలోనే పెరిగారని, కానీ పూర్వీకుల ద్వారా ఆమెకు భారతీయ మూలాలు ఉన్నాయని మస్క్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె మస్క్‌కు చెందిన న్యూరాలింక్ కంపెనీలో ఆపరేషన్స్ డైరెక్టర్‌గా కీలక బాధ్యతలు చూస్తున్నారు. ఇదే సందర్భంలో, అమెరికా అభివృద్ధిలో భారతీయ మేధావుల పాత్ర చాలా ఉందని, వారి టాలెంట్ వల్ల అమెరికా ఎంతో లబ్ధి పొందిందని మస్క్ ప్రశంసల వర్షం కురిపించారు.

