విమానం సీట్ బెల్ట్ పెట్టుకోగానే అంతా సేఫ్ అనుకుంటున్నారా? ఏటీసీ చేసిన ఒక్క తప్పు.. ఇద్దరు బలి!
విమానం ఎక్కి సీట్ బెల్ట్ పెట్టుకోగానే మనం ఎంత సేఫ్‌గా ఫీలవుతాం? కానీ, కింద కంట్రోల్ రూమ్‌లో కూర్చున్న ఒకే ఒక్క వ్యక్తి చేసే చిన్న పొరపాటు.. పదుల సంఖ్యలో ప్రాణాలను ఎలా గాలిలో కలిపేస్తుందో అమెరికాలో జరిగిన ఈ ఘోర ప్రమాదం కళ్లకు కట్టింది.
ఎంతో సురక్షితం అనుకునే విమాన ప్రయాణం.. కమ్యూనికేషన్ లోపం వల్ల క్షణాల్లో ఎలా మృత్యుపాశంగా మారుతుందో లార్గార్డియా ఎయిర్‌పోర్ట్ సాక్షిగా నిరూపితమైంది. రేపు మనం లేదా మన కుటుంబ సభ్యులు విమానం ఎక్కినా, గమ్యం చేరేవరకు ప్రాణాలు మన చేతుల్లో ఉండవు అనడానికి ఈ ఘటనే సజీవ సాక్ష్యం.
రన్‌వేపై మృత్యుఘోష.. అసలేం జరిగింది?
కెనడాలోని మాంట్రియల్ నుంచి 76 మందితో వస్తున్న 'ఎయిర్ కెనడా ఎక్స్‌ప్రెస్' విమానం లార్గార్డియా రన్‌వేపై దిగుతోంది. అదే సమయంలో పోర్ట్ అథారిటీకి చెందిన ఒక ఫైర్ ఇంజిన్ అకస్మాత్తుగా రన్‌వే పైకి వచ్చింది.
గంటకు 39 కిలోమీటర్ల వేగంతో ల్యాండ్ అవుతున్న విమానం.. నేరుగా వెళ్లి ఆ ఫైర్ ట్రక్కును బలంగా ఢీకొట్టింది. క్షణాల వ్యవధిలో విమానం ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. ఈ ఘోర ప్రమాదంలో పైలట్, కో-పైలట్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 13 మంది రక్తపు మడుగులో హాహాకారాలు చేశారు.
"ఆగు ఆగు".. ఆ ఒక్క పదం ముందే వినిపించి ఉంటే!
ఈ ప్రమాదానికి సంబంధించి లీకైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ATC) ఆడియో నెట్టింట కంటతడి పెట్టిస్తోంది. మరో ఎమర్జెన్సీని డీల్ చేస్తున్న ఆ అధికారి.. ఏమరుపాటుగా ఫైర్ ట్రక్కును రన్‌వే దాటేందుకు అనుమతి ఇచ్చారు.
కానీ, క్షణాల్లోనే విమానం వస్తున్న విషయాన్ని గ్రహించి "ట్రక్ వన్.. ఆగు. ఆగు. ఆగు" అంటూ ప్రాణభయంతో అరిచారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. "నేను తప్పు చేశాను.. ఆపడానికి ప్రయత్నించాను" అంటూ ఆ కంట్రోలర్ పడుతున్న ఆవేదన ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది.
లార్గార్డియాలో అతిపెద్ద విషాదం.. మొదలైన దర్యాప్తు
ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విమానయాన రంగం ఎంత ప్రమాదకరమైనదో ఈ ఘటన రుజువు చేసిందని ఆయన అన్నారు. అటు కెనడా ప్రధాని మార్క్ కార్నీ కూడా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
1992 తర్వాత ఈ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన అతిపెద్ద విషాదం ఇదే. భద్రతా లోపంపై అమెరికా, కెనడా ఏవియేషన్ సంస్థలు అత్యవసర దర్యాప్తును ముమ్మరం చేశాయి.
గాల్లో ప్రయాణం.. ఇక గాల్లో దీపమేనా?
రోజురోజుకూ ఎయిర్ ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతున్న ఈ రోజుల్లో.. కేవలం మనుషులపైనే ఆధారపడటం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన హెచ్చరిస్తోంది. ఆటోమేటెడ్ రన్‌వే ఇన్‌కర్షన్ సిస్టమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లాంటి ఆధునిక టెక్నాలజీని తక్షణమే ప్రతి విమానాశ్రయంలో తప్పనిసరి చేయాలి. మనుషుల ఒత్తిడి, ఏమరుపాటుకు ఏవియేషన్ సెక్టార్‌లో ఏమాత్రం చోటు లేదు. ప్రయాణికులుగా మనం కూడా విమానం రన్‌వే పైకి దిగి, ఇంజిన్ పూర్తిగా ఆగే వరకు అప్రమత్తంగా ఉండటం.. సేఫ్టీ ప్రొసీజర్స్‌ను పాటించడం చాలా అవసరం.
Also Read:
పశ్చిమాసియాలో ఉత్కంఠ: దాడుల నిలిపివేతపై అమెరికా, ఇజ్రాయెల్ మధ్య విభేదాలు!Crude Oil Prices Crash: ట్రంప్ దెబ్బకు పేకమేడలా కుప్పకూలిన బ్రెంట్ క్రూడ్ ధరలు
Global Energy Crisis: ఇంధన కరువుతో అల్లాడుతున్న ప్రపంచం!
Israel Attacks Tehran: ట్రంప్ మాటలకే పరిమితం.. టెహ్రాన్‌పై బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్!
Trump Halts Iran Strikes: ఇరాన్ పై దాడులు ఆపిన ట్రంప్

