Horoscope Today in Telugu : 22-05-2025 గురువారం ఈ రోజు రాశి ఫలాలు

 

daily horoscope

మేషం (Aries)

ఈ రాశి వారికి ఈ రోజు వ్యయప్రయాసలు అధికంగా ఉంటాయి. బంధువులతో వైరం వచ్చే అవకాశం ఉంది. అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబంలో ఒత్తిడులు నెలకొంటాయి. దైవ దర్శనం చేసుకుంటారు. మీరు చేపట్టిన పనుల్లో నిరుత్సాహం ఎదురవుతుంది. వృత్తి మరియు వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఓపికతో వ్యవహరించడం మంచిది.

వృషభం (Taurus)

ఈ రాశి వారికి ఈ రోజు శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభం పొందే అవకాశం ఉంది. మీరు చేస్తున్న ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. మీ పలుకుబడి పెరుగుతుంది. మిత్రుల రాక మీకు సంతోషం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరియు ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి.

మిథునం (Gemini)

ఈ రాశి వారికి ఈ రోజు బంధువుల తోడ్పాటుతో ముందుకు సాగుతారు. ఆకస్మిక ధన, వస్తులాభాలు ఉంటాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కొన్ని విచిత్ర సంఘటనలు చోటుచేసుకోవచ్చు. నూతన పరిచయాలు మీకు సంతోషం కలిగిస్తాయి. వృత్తి మరియు వ్యాపారాలలో అనుకూలత ఉంటుంది. కొత్త అవకాశాలు మిమ్మల్ని పలకరిస్తాయి.

కర్కాటకం (Cancer)

ఈ రాశి వారు ఈ రోజు రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంటిలోనూ, బయట కూడా చికాకులు ఎదురవుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది. ధనవ్యయం జరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది.

సింహం (Leo)

ఈ రాశి వారికి ఈ రోజు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. రుణాలు చేయవలసి వస్తుంది. మీ ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. సోదరులు మరియు మిత్రుల నుండి కొన్ని సమస్యలు రావచ్చు. వృత్తి మరియు వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.

కన్య (Virgo)

ఈ రాశి వారికి ఈ రోజు ఇంటిలోనూ, బయట కూడా ప్రోత్సాహం లభిస్తుంది. ఆకస్మిక ధన, వస్తులాభాలు ఉంటాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విందులు మరియు వినోదాలలో పాల్గొంటారు. మీరు చేస్తున్న ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు మరియు ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

తుల (Libra)

ఈ రాశి వారికి ఈ రోజు దూరపు బంధువుల నుంచి ముఖ్యమైన సమాచారం అందుతుంది. విందులు మరియు వినోదాలలో పాల్గొంటారు. మీరు చేస్తున్న ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. స్థిరాస్తి వృద్ధి ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు లభించే అవకాశం ఉంది.

వృశ్చికం (Scorpio)

ఈ రాశి వారికి ఈ రోజు మిత్రులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంటిలోనూ, బయట కూడా చికాకులు ఉంటాయి. ఆరోగ్యం బాగోలేకపోవచ్చు. విద్యార్థులు చేస్తున్న ప్రయత్నాలలో అవాంతరాలు ఎదురవుతాయి. వృత్తి మరియు వ్యాపారాలు ముందుకు సాగవు.

ధనుస్సు (Sagittarius)

ఈ రాశి వారికి ఈ రోజు పనుల్లో ఆలస్యం జరుగుతుంది. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు ఉంటాయి. ఆరోగ్యం బాగోలేకపోవచ్చు. దేవాలయ దర్శనాలు చేసుకుంటారు. మిత్రుల నుండి ఒత్తిడులు ఉంటాయి. లేనిపోని ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వృత్తి మరియు వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.

మకరం (Capricorn)

ఈ రాశి వారికి ఈ రోజు ఆకస్మిక ధనప్రాప్తి ఉంటుంది. సమాజంలో ఎనలేని గౌరవం లభిస్తుంది. ఆస్తికి సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. మీ సోదరులతో సఖ్యత ఉంటుంది. కొత్త ఉద్యోగయోగం ఉంది. మీ ఖ్యాతి విస్తరిస్తుంది. వాహన సౌఖ్యం ఉంటుంది. వ్యాపారాలు మరియు ఉద్యోగాలలో ఉన్నతి సాధిస్తారు.

కుంభం (Aquarius)

ఈ రాశి వారికి ఈ రోజు శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు తలెత్తవచ్చు. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. రుణాలు చేస్తారు. మిత్రులతో వివాదాలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగోలేకపోవచ్చు. ఇంటిలోనూ, బయట కూడా ఒత్తిడులు ఉంటాయి. వృత్తి మరియు వ్యాపారాలు అంతగా అనుకూలించవు.

మీనం (Pisces)

ఈ రాశి వారు ఈ రోజు ముఖ్యమైన కార్యక్రమాలను చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. వాహన యోగం ఉంది. కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆలయాలను సందర్శిస్తారు. వృత్తి మరియు వ్యాపారాలు సజావుగా సాగుతాయి. మీ ప్రయత్నాలకు మంచి ఫలితం లభిస్తుంది.