సోషల్ మీడియాలో ఇప్పుడు ఒకటే మోత.. అది 'అఖండ 2' నామస్మరణ! నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'అఖండ 2: తాండవం' రిలీజ్ టీజర్ వచ్చేసింది. బాలయ్య బాబు విశ్వరూపం చూసి ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు.
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా విడుదలైన 67 సెకన్ల రిలీజ్ టీజర్ ఆ అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లింది. ఇందులో బాలయ్య ఎలివేషన్స్, డైలాగ్స్ చూస్తే రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం.
"ఎవర్రా ఆ విబూది కొండను ఆపేది.."
టీజర్‌లో బోయపాటి శ్రీను తన మార్క్ 'మాస్ మ్యాజిక్'ను మరోసారి చూపించారు. మంచు పర్వతాలు, అగ్ని జ్వాలలు, నెత్తుటి మరకల మధ్య బాలయ్య రుద్రతాండవం చేశారు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండలో వచ్చే డైలాగ్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి.
"కాషాయం కట్టుకున్న ఆ దేశాన్ని చూడు.."
"త్రిశూలాన్ని పట్టుకున్న ఆ దైవాన్ని చూడు.."
"ఎవర్రా ఆ విబూది కొండను ఆపేది.."
అంటూ సాగే డైలాగ్స్ థియేటర్లలో విజిల్స్ వేయించడం పక్కా.
డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా..
బాలయ్య దివ్య రౌద్ర రూపం, థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వెరసి టీజర్ అదిరిపోయింది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇప్పటికే సోషల్ మీడియా అంతా బాలయ్య మాస్ జాతరతో మారుమోగిపోతోంది.

