ఒకప్పుడు భారతీయ సినీరంగంలో అగ్ర హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందింది శిల్పా శెట్టి. 18 ఏళ్ల వయసులోనే స్టార్ హీరోయిన్‌గా మారి, హిందీలో వరుస ఆఫర్‌లు అందుకుంది. అయితే, కెరీర్ తొలినాళ్లలో ఆమె ఎన్నో విమర్శలను ఎదుర్కొంది. "అందంగా లేదు", "కలర్ తక్కువ" అంటూ ఎన్నో అవమానాలను ఎదుర్కొంది. దీని కారణంగా ఆమెను చాలా సినిమాల నుంచి తొలగించారు. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే వివాదాలతో నిత్యం వార్తల్లో నిలిచింది. కట్ చేస్తే... ఇప్పుడు రూ. 2800 కోట్ల ఆస్తులున్న వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె, ప్రస్తుతం బుల్లితెరపై పలు రియాల్టీ షోలలో జడ్జిగా వ్యవహరిస్తోంది. అలాగే, సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ వరుసగా పోస్టులు చేస్తుంది.
సినీ రంగంలో ఎదురైన సవాళ్లు
చాలా సంవత్సరాలుగా సినీరంగంలో ఉన్నత స్థానంలో నిలబడటం అంత సులభం కాదు, ముఖ్యంగా హీరోయిన్లకు చాలా కష్టం. ఫిట్‌నెస్, గ్లామర్ రెండింటి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే, బాడీ షేమింగ్, సవాళ్లు, కష్టాలను నవ్వుతూనే ఎదుర్కోవాల్సి ఉంటుంది. శిల్పా శెట్టి హిందీ, తెలుగు, కన్నడ భాషలలో అనేక చిత్రాల్లో నటించింది. అయితే, కెరీర్ ప్రారంభంలో ఆమెకు తెలియకుండానే పలు సినిమాల నుంచి తొలగించారు. 'దార్', 'ఇండియన్', 'షూన్' వంటి చిత్రాలతో పాటు 'మై ఖిలాడీ తూ అనారీ' సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది.
ప్రేమ, పెళ్లి, వివాదాలు
కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే అక్షయ్ కుమార్‌తో శిల్పా శెట్టి ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. కానీ, వీరిద్దరు కొన్నాళ్లకే విడిపోయారు. ఆ తర్వాత వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను వివాహం చేసుకుంది. ఆయన ఆస్తులు సుమారు రూ. 2800 కోట్లు కాగా, శిల్పా శెట్టి ఆస్తులు రూ. 340 కోట్లు. ఈ లెక్కన, శిల్పా శెట్టి అత్యంత ధనిక హీరోయిన్లలో ఒకరు. అయితే, రాజ్ కుంద్రా పలు వివాదాలతో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు.